తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాలు  జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.  తెలుగు తెరపై మొదటి సారిగా భారీ బడ్జెట్ తో రూపొందిన ‘బాహుబలి, బాహుబలి 2’ సినిమాలు కలెక్షన్లు వసూళ్లు చేయడంలో కూడా రికార్డులు క్రియేట్ చేశాయి.  బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో పేరు వచ్చిన విషయం తెలిసిందే.  
బాహుబలి 2 తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజమౌళి మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సన్నాహాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 
Image result for rrr movie
ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’(వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ షర వేగంగా జరుగుతుంది.  2020 లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహలు జరుగుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే భారీ తారాగణం ఉంటుందని అందరూ ముందే ఊహించేస్తున్నారు. 
ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు కూడా భారీ సంఖ్యలో ఆర్టిస్టులను ఉపయోగిస్తున్నారు. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌లు తీస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఈ పోరాట సన్నివేశాల కోసం ఏకంగా వెయ్యి మంది పనిచేన్నారు.
Image result for rrr movie
 రాజమౌళి తన సినిమాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ వాడుతున్న విషయం తెలిసిందే..కానీ ఈ సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా..రియాల్టీకి దగ్గరగా ఉండేలా చూస్తున్నారట. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. సముద్ర ఖని కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. రూ. 300కోట్లతో ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: