రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కలసి నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈసినిమా కధకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్ననేపధ్యంలో లేటెస్ట్ గా లీక్ అయిన కొన్ని ఫోటోలు ఈమూవీ కధకు సంబంధించినవి అన్న ప్రచారం జరుగుతోంది. ఈమూవీ బ్రిటీష్ కాలంనాటి పీరియాడిక్ డ్రామా అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇందులో చరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారిగా ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించబోతున్నట్లు గాసిప్పులు వస్తున్న విషయం తెలిసిందే. 
300 కోట్ల బడ్జెట్
ఈమూవీ కథ అంతా పునర్జన్మల ప్రస్తావన చుట్టూ తిరుగుతుంది అని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ ‘ఆర్ఆర్ఆర్’  చిత్ర లొకేషన్ నుండి లీకైన కొన్ని ఫోటోల విషయం తెలుసుకుని ఆ లీక్ ఎలా జరిగింది అన్న విషయమై రాజమౌళి తన యూనిట్ తో లోతుగా చర్చలు జరుపుతున్నట్లు టాక్. లీక్ అయిన ఈఫోటో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ గా కనిపిస్తోంది. 

దీనికితోడు బ్రిటీష్ జెండా కూడ కనిపిస్తున్న పరిస్థుతులలో ఖచ్చితంగా ఈఫోటోను బట్టి ఇప్పటి వరకు లీక్ అయిన ఈమూవీ కథ యదార్ధమే అంటూ అప్పుడే కొందరు అంచనాలకు వచ్చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి కొన్ని ఏరియాల నుంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నా వాటి విషయమై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రాజమౌళి ఇప్పటికే నిర్మాత దానయ్యకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్. 
ss rajamouli office becomes the talk of the town after rrr movie launch
ప్రస్తుతం ఈమూవీకి సంబంధించి రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ను భారీగా తీస్తున్న నేపధ్యంలో మొట్టమొదటిసారిగా జూనియర్ లేకుండా ఈమూవీ షూటింగ్ జరుగుతోంది. ఒకవైపు ఈమూవీ షూటింగ్ చేస్తూనే మరొకవైపు ఈమూవీకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక విషయమై కొదరు బాలీవుడ్ హీరోయిన్స్ తో రాజమౌళి చర్చలు జరుపుతూ ఈమూవీకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: