వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ పై ఓ పక్క యూత్ ఆడియెన్స్ వెర్రివాళ్లు అవుతుంటే మరోపక్క ఆమె చేసే పనుల వల్ల సోషల్ మీడియాలో నెటిజెన్ల విమర్శలకు ఛాన్స్ ఇస్తుంది. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో కన్ను గీటిన ప్రియా ప్రకాశ్ ఆ ఒక్క టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఇక ఆ టీజర్ తో వచ్చిన క్రేజ్ తో ఆ సినిమాను మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.


ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు టీజర్ మరో సెన్సేషన్ అయ్యింది. ప్రియా పెదవులను హీరో రోషన్ అబ్ధుర్ లిప్ లాక్ హంగామా సృష్టించింది. ప్రియా అదరచుంభనం మరోసారి వైరల్ అయ్యింది. అయితే ఈ సీన్ పై యూత్ ఎగబడి చూస్తుంటే కొందరు మాత్రం కామెంట్స్ చేస్తున్నారు.


స్కూల్ డ్రెస్ లో ఈ లిప్ లాక్ ఏంటి అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారు. నేటి యువతని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ప్రియా ప్రకాశ్ సినిమాకు మాత్రం మంచి పబ్లిసిటీ వస్తుంది. మొదటి సినిమాతోనే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ తెలుగులో కూడా ఆఫర్స్ అందుకుంటుంది.


నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ అవసరం ఉండగా కీర్తి సురేష్, మేఘా ఆకాష్ తో పాటుగా మూడవ హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ కూడా సెలెక్ట్ అయ్యిందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: