టాలీవుడ్ లోకి దేవదాసు సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు సక్సెస్ కాలేకపోయాడు.  కానీ ఈ హీరో క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు..ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాలో నటిస్తున్నాడు.  ఇటీవల విడుదలైన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఈసారి కొత్తదనంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నాడు.  ఇక పూరిజగన్నాధ్ విషయానికి వస్తే తన సినిమాలో హీరోయిజం ఓ రేంజ్ లో చూపిస్తారన్న విషయం తెలిసిందే.
Image result for ismart shankar
గతంలో పలు డిజాస్టర్లతో బాధపడుతున్న మహేష్ బాబు కి ‘పోకిరి’లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు.  ఆ మద్య ‘టెంపర్’సినిమాతో ఎన్టీఆర్ ని డిఫరెంట్ షేడ్స్ లో చూపించాడు.  ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. పూరి సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇటీవలే రెగ్యులర్ షూటింగుకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. రామ్ తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 
Image result for ismart shankar
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి మంచి హైలెట్ కానున్నదని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కనిపించనున్నారు.  గత కొంత కాలంగా ఇటు రామ్ కి..అటు పూరికి సక్సెస్ లు లేవన్న విషయం తెలిసిందే..అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరూ ఆశించే హిట్ ఈ సినిమా ఇస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: