యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి ముందు బాహుబలి తర్వాత ఎంత మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించడమే కాకుండా ప్రభాస్ సత్తా కూడా చాటేలా చేసింది. తెలుగులో ఏ హీరోకి లేని నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రభాస్.


బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 150 నుండి 200 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అవుట్ పుట్ మీద ప్రభాస్ అండ్ టీం సాటిస్ఫైడ్ గా ఉన్నారని తెలుస్తుంది. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభస్ సరసన శ్రద్ధ కపూర్ నటిస్తుంది.


సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా జాన్. ఈ సినిమాను కూడా యువి క్రియేషన్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్లు ఉంటుందట. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రెండు జన్మల ప్రేమకథగా జాన్ ఉంటుందట. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 


అంటే ఈ లెక్కన ఇక ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాతలు కనీసం 200 కోట్లు పట్టుకోవాల్సిందే.. ఇన్నాళ్లు తెలుగుకే పరిమితమైన ప్రభాస్ ఇప్పుడు తెలుగుతో పాటుగా తమిళ, హింది ప్రేక్షకులను అలరించనున్నాడు. తన ప్రతి సినిమా మూడు భాషల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సాహో కూడా హిట్టైతే ప్రభాస్ నేషనల్ స్టార్ అన్నట్టే లెక్క. 



మరింత సమాచారం తెలుసుకోండి: