మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ లో అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించబోతున్నాడు అన్న వార్తలు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయ మై ఒక స్పష్టమైన క్లారిటీకి మెగా కాంపౌండ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోని బన్నీ పాత్రకు సంబంధించిన షూట్ ఇంకా చేయలేదని కొద్ది రోజుల్లో అల్లు అర్జున్ ‘సైరా’ షూటింగ్‌లో పాల్గొంటాడు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించే పాత్ర కూడ ఫైనల్ కావడంతో బన్నీ లుక్ కు సంబంధించిన చర్చలు ఇప్పుడు జరుగుతున్నట్లు సమాచారం. 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాత్ర గురించి
ఇటీవల కాలంలో అల్లు అర్జున్ గెడ్డం పెంచి రఫ్‌ గా కనిపించడం ‘సైరా’ కోసమే అని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి  అల్లు అర్జున్‌ను సైరాలో నటింపజేసేందుకు జరిగిన చర్చలలో చిరంజీవి కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. ఈ మూవీని మళయాళ భాషలో కూడ డబ్ చేసి విడుదల చేయాలి అన్న ఆలోచనల నేపధ్యంలో ఈ మూవీకి మళయాళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేయడానికి ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు  జరిగితే మార్చి నెలలో అల్లు అర్జున్ షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ నుండి లీకులు వస్తున్నట్లు సమాచారం.  
 మార్చిలో షూటింగ్‌కు..
‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న టార్గెట్ తో నిర్మింపబడుతున్న ‘సైరా’ తన లక్ష్యాలను చేరుకోవడానికి    హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలలో విడుదల చేయడానికితోడు ఆ భాషలలో ప్రముఖులుగా కొనసాగుతున్న ప్రముఖ నటీనటులను ‘సైరా’ మూవీ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దింపుతున్న విషయం తెలిసిందే. దీనితో ఈ మూవీ క్రేజ్ ను దేశం అంతా  విస్తరించేలా మెగా కాంపౌండ్ వ్యూహాలు రచిస్తోంది. 
megastar chiranjeevi starrer sye raa narasimha reddy teaser released
దీనికితోడు గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కు దూరం జరుగుతున్నాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీ చేత ‘సైరా’ లో ప్రత్యేక పాత్రను చేయిస్తే హడావిడి చేస్తున్న ఈ రూమర్స్ కు చెక్ పెట్టే ఆస్కారం ఏర్పడుతుంది అన్న ఆలోచనలు కూడ చిరంజీవికి ఉన్నట్లు టాక్. ఈ వార్తలు కార్యరూపం దాలిస్తే ‘సైరా’ మార్కెట్  ‘బాహుబలి’ స్థాయిలో జరిగే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: