క్రేజీ యంగ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక డేట్స్ కోసం యంగ్ హీరోలు అంతా ఎదురు చూస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది. కన్నడం తమిళం తెలుగు సినిమాల నుండి వస్తున్న ఆఫర్లకు ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అలాంటి రష్మికకు ఒక చెప్పుకోలేని సమస్య ఉందట.
Kannada actress Rashmika Mandanna
ఆ సమస్యను అధిగమించడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఏమి సక్సస్ కావడం లేదు అని అంటోంది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే రష్మికకు ఇన్ని సినిమాలలో నటించినా రొమాంటిక్ సీన్స్ లో నటించే సమయంలో ఆమెకు చాల సిగ్గు ఎక్కువ అని చెపుతోంది. అంతేకాదు ఇలాంటి సీన్స్ నటించే విషయంలో తాను ఎక్కువగా టేకులు తీసుకోవడమే కాకుండా చాల ఇబ్బంది పడుతూ ఉంటానని తన బాధను బయటకు చెప్పుకుంటోంది.  
Rashmika Mandanna latest Stills From Interview
దీనితో సిగ్గు పడుతూ నటిస్తేనే రష్మిక క్రేజ్ ఇలా ఉంటే ఇక సిగ్గు లేకుండా నటిస్తే ఆమె క్రేజ్ ఏస్థాయిలో ఉంటుందో అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే రష్మికను తన సిగ్గును పోగొట్టుకో వద్దని సలహాలు కూడ ఇస్తున్నారు. దీనితో ఆమె చేసిన కామెంట్స్ పై సెటైర్లు పెరిగి పోతున్నాయి. 
rashmika mandanna ,rashmika mandanna hot photos,rashmika mandanna sandalwood actress, hot celebs,
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్ కూడ రష్మిక డేట్స్ ను బట్టి తన కొత్త సినిమా షెడ్యూల్ ను మారుస్తున్న పరిస్థుతులలో ఆమె రేంజ్ ఏస్థాయికి చేరుకుంటుందో ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. ఈమధ్య ఒక యంగ్ హీరో తన పారితోషికం తగ్గించి రష్మికకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ఆమెను బుక్ చేయమని సలహా ఇచ్చాడు అంటే ఆమె మ్యానియా ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: