వంశీ పైడిపల్లి సినిమా తరువాత మహేష్ సుకుమార్ సినిమా లో నటించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా ఉంటుందా .. ఉండదా అని సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మైత్రీమూవీస్ నుంచి ఎటువంటి స్పందనలేదు కాబట్టి. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి రంగప్రవేశం చేసారని, మహేష్ తో టచ్ లో వున్నారని వార్తలు పుట్టుకువచ్చాయి. అదే సమయంలో సుకుమార్ పూర్తి కథ తయారుచేయలేదని, మహేష్ నుంచి పూర్తి సమ్మతి రావడంలేదని కూడా వినిపించింది.

Image result for mahesh babu

ఏది కరెక్టో, కాదో తెలియకున్నా, అభిమానుల నుంచి మహేష్ మీద ఒకరకమైన వత్తిడి పెరుగుతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయమని అభిమానులు కోరుతున్నారు. ఎప్పుడూ క్లాస్ డ్రెస్సింగ్, సీరియస్ లుక్స్, స్టిఫ్ బాడీ లాంగ్వేజ్ తో అంతా పెద్దమనిషి తరహా పాత్రలే చేస్తున్నారని, పోకిరి, దూకుడు తరువాత సరైన మాస్ ఎంటర్ టైనర్ పడలేదని అభిమానుల గోల.

సుకుమార్ సినిమా ఉంటుందా? ఊడుతుందా?

ఇదిలావుంటే సుకుమార్ తన నిర్మాణ భాగస్వామ్యంలో రెండు సినిమాలు తలకెత్తుకున్నారు. ఇంకో ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా వున్నాయి. ఇప్పటిదాకా మహేష్ కోసం కథ రెడీకాలేదని, కొంత సమయం కావాలని అడుగుతున్నారని కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ఆరునెలలు సమయం కావాలని సుకుమార్ అడిగారంటూ కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. ఆరునెలలు అంటే అనిల్ రావిపూడి చకచకా సినిమా లాగించేయగలరు. కానీ మహేష్ ఊ అనాల్సి వుంది. మరి సుకుమార్ కే టైమ్ ఇచ్చి, సైలెంట్ గా కూర్చుంటారా? లేక ఈ గ్యాప్ లో ఇంకో సినిమా చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: