‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి తన కెరియర్ లో ఏసినిమా విషయంలోనూ తీసుకోనంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘బాహుబలి’ తరువాత వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకులలో పెరిగిన అంచనాలు అందుకోలేకపోతే ఊహించని ఫలితాలు వస్తాయి అన్న విషయం రాజమౌళికి స్పష్టంగా తెలుసు. 
SS Rajamouli,Ram Charan and Jr NTR,RRR
దీనికితోడు చరణ్ జూనియర్ లకు బాలీవుడ్ మార్కట్ లో అదేవిధంగా బాలీవుడ్ ప్రేక్షకులలో చెప్పుకోతగ్గ ఇమేజ్ లేకపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై సంచలనాలు సృష్టించాలి అంటే ఈ మూవీకి ఒక టాప్ బాలీవుడ్ హీరో అండ ఉండాలి అన్న ఆలోచనలు రాజమౌళిలో వస్తున్నట్లు టాక్. దీనితో ఈమూవీకి సంబంధించిన ఒక కీలక పాత్ర కోసం రాజమౌళి ఇప్పటికే అజయ్ దేవగన్ సంప్రదించినా అతడి వైపు నుండి సరైన స్పందన రాలేదు అని తెలుస్తోంది. 

దీనితో ప్రస్తుతం రాజమౌళి ఆలోచనలు అన్నీ అక్షయ్ కుమార్ వైపు తిరుగుతున్నట్లు సమాచారం. దీనికితోడు అక్షయ్ కుమార్ ‘2.0’ లో నటించిన విలన్ పాత్రకు దక్షిణాది సినిమా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయిన నేపధ్యంలో అక్షయ్ కుమార్ వల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ కు అటు బాలీవుడ్ లో ఇటు దక్షిణాది రంగానికి చెందిన వివిధ భాషలకు చెందిన ప్రాంతాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది అని రాజమౌళి అంచనా అని అంటున్నారు.

అయితే రాజమౌళి అక్షయ్ కుమార్ కు ఆఫర్ చేసిన పాత్ర ఈమూవీకి సంబంధించిన ప్రత్యేక పాత్ర లేదంటే విలన్ పాత్ర అన్న విషయమై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ఈమూవీ షూటింగ్ ను ఎట్టి పరిస్తుతులలోను ఈ సంవత్సరాంతం లోపు పూర్తి చేసి 2020 లో వచ్చే ఉగాది పండుగ రోజున విడుదల చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: