జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. అదిరే అభి టీం లో చిన్న చిన్న రోల్స్ వేస్తూ వచ్చి ఆ తర్వాత స్క్రిప్ట్ అందిస్తూ తన టాలెంట్ తో టీం లీడర్ అయ్యి తన పంచుల ప్రవాహంలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు హైపర్ ఆది. ఈమధ్య సినిమాల్లో కూడా బాగానే కనిపిస్తున్న ఆది మొదటిసారి బాలకృష్ణ కాంట్రవర్సీపై నోరు విప్పాడు.


హైపర్ ఆది దాదాపు సంవత్సరం క్రితం బాలకృష్ణ మీద సెటైరికల్ గా ఓ స్క్రిప్ట్ చేశాడు. ఆ స్క్రిప్ట్ చూసిన బాలయ్య ఆదికి వార్నింగ్ ఇచ్చాడని.. బాలకృష్ణ ఫ్యాన్స్ నుండి ఆదికి బెదిరింపులు వచ్చాయని అన్నారు. కాని ఆది చెప్పిన వర్షన్ వేరేలా ఉంది. అసలు బాలకృష్ణ గారు తనకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదని అన్నాడు.


యూట్యూబ్ ఛానెల్ వారు వ్యూస్ కోసం అలాంటి వార్తలు రాశారు తప్ప అసలు అందుకో విషయం ఏమి లేదని అన్నారు ఆది. అయితే ఓ స్కిట్ విషయంలో బాలకృష్ణ అభిమాని ఒకరు ఫోన్ చేసి జబర్దస్త్ టీం లో ఒకరిని బెదిరించింది వాస్తవం అని అయితే అది తాను మాత్రం కాదని అన్నాడు ఆది.


ఎప్పుడో జరిగిన ఈ విషయంపై ఆది ఇప్పుడు అసలు విషయం ఇది అని చెప్పడం న్యూస్ మరింత వైరల్ అవుతుంది. ఈమధ్య జబర్దస్త్ షోలో కన్నా బయట ఎక్కువ కనిపిస్తున్న ఆది జనసేన తరపున ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈమధ్య వేరే పార్టీ వాళ్లతో గొడవ పడి హంగామా చేసిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: