రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ కాదు నేషనల్ డైరెక్టర్ బాహుబలి తో తన ఊహ సామ్రాజ్యము ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన చాటి చెప్పిన దర్శక ధీరుడు. ఈనేపథ్యంలో ఆయన నుంచి రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు.

Image result for rajamouli

ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను ఓ కీలకపాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. కారణం ఏమిటో తెలియదు కానీ రాజమౌళి ఆఫర్ అజయ్ దేవగన్ రిజెక్ట్ చేసినట్లు టాక్. అజయ్ దేవగన్‌ నో చెప్పడంతో వెంటనే ‘ఆర్ఆర్ఆర్' మేకర్స్ మరో స్టార్ అక్షయ్ కుమార్‌ను సంప్రదించినట్లు తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంతకు ముందు అజయ్ దేవగన్ మీద... కమల్ హాసన్ ‘ఇండియన్ 2'లో అతడిని విలన్ పాత్ర కోసం సంప్రదించారని, అందుకు అతడు ఒప్పుకోలేదనే వార్తలు వినిపించాయి. 

రూ. 300 కోట్ల బడ్జెట్

బాలీవుడ్ మార్కెట్ గ్రాబ్ చేయాలంటే హిందీ సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ఒక స్టార్ ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో భాగం అయితే బావుంటుందని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అయితే చివరకు ఎవరు ఒప్పుకుంటారో? ఫైనల్ అయ్యేది ఎవరో వేచిచూడాల్సిందే. ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ స్థాయి బాహుబలి రేంజికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి క్లూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: