హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదా శర్మ ఆ తర్వాత సరైన సినిమాల ఎంపిక కుదరకపోవడంతో క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులర్ అయ్యింది. తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలతో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి.


ముఖ్యంగా ఇన్ స్టా వీడియోలతో చిన్న పాటి మెసేజ్ కూడా ఇస్తూ అదరగొడుతున్న అదా శర్మ తన సోయగాలతో అందరిని అలరిస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో సరైన ఛాన్స్ వస్తే తానేంటో చూపిస్తా అన్నట్టుగా అమ్మడు అదరగొడుతుంది. ప్రస్తుతం రాజశేఖర్ కల్కి సీమాలో నటిస్తున్న అదా శర్మ నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.


అయితే నాని సినిమాలో అదా శర్మ ఐటం సాంగ్ చేస్తుందట. ఈమధ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతున్నారు. ఆ క్రమంలో అదా శర్మ ఐటం సాంగ్ నాని జెర్సీ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఫోటో షూట్స్ తోనే అందాల ప్రదర్శనతో అదరగొట్టే అదా శర్మ రాక రాక వచ్చిన ఈ ఛాన్స్ లో దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.


ఐటం సాంగ్ తో అదా శర్మ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న నాని జెర్సీ సినిమా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధ శీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏప్రిల్ 5 ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: