జబర్దస్త్ లో పొట్టిగా చిన్నపిల్లాడిలా ఉండి అందర్నీ నవ్వించే నటుడు నరేష్ మరోసారి వివాదాల్లోకి వచ్చాడు. పొట్టివాడుగా కనిపించే నరేష్.. తన రూపాన్నే కామెడీ వస్తువుగా మార్చుకున్నాడు. ఏ కామెడీ షో చేసినా తన మార్కు హాస్యంతో అలరిస్తుంటాడు.

Image result for jabardasth naresh attack

ఈ నరేశ్ పై శ్రీకాకుళం జిల్లాలో దాడి జరిగింది. జబర్దస్త్ షోలే కాకుండా బయట కూడా తన టీమ్‌ తో కామెడీ షోలు చేస్తుంటాడు నరేశ్. ఇటీవల శ్రీకాకుళంలో తన టీమ్ తో కలిసి ఓ షో చేసేందుకు వెళ్లిన నరేష్ పై అక్కడి స్థానికులు దాడికి దిగారు.

Image result for jabardasth naresh attack


శ్రీకాకుళంలో కళింగాంధ్ర ఉత్సవాల్లో ప్రదర్శన కోసం వెళ్లిన నరేష్ కు అక్కడి చినరాబటం ప్రాంత కుర్రాళ్లతోగొడవ జరిగిందట. ఆ యువకులు నరేశ్ ఉన్న గ్రీన్ రూమ్‌లోకి చొచ్చుకురావడంతో నరేశ్ వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకున్నారట. ఆ సమయంలోనే మాటామాటా పెరిగాయి.

Image result for jabardasth naresh


ఆ తర్వాత నరేశ్ తన ప్రదర్శన ముగించుకుని వస్తుండగా ఆ యువకులు దారి కాచి దాడికి దిగారు. ఐతే నరేశ్‌కు పెద్దగా గాయాలేమీ కాలేదు. నరేశ్ టీమ్ ఫిర్యాదుతో స్థానిక పోలీసులు ఆ యువకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: