టాలీవుడ్, కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు విశాల్.  హీరోగానే కాకుండా నడిఘర్ సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్నాడు.  సినీ, రాజకీయ నేపథ్యంలో ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న విశాల్ ఇటీవల ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  త్వరలో తన ప్రేయసి అనీశాను వివాహం చేసుకోబోతున్నట్టు విశాల్ ఈమధ్య ప్రకటించి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు.  గతంలో విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ల మద్య ప్రేమ వ్యవహారం నడిచిందని..వారి ప్రేమ పెళ్లి వరకు వచ్చినా పెద్దల నో చెప్పారని వార్తలు వచ్చాయి. 
Related image
ఈ విషయంపై ఇద్దరూ అదేమీ లేదని తాము కేవలం ఫ్రేండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.  తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ..తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  అనీశా ప్రేమలో తాను పడిపోతానని అస్సలు అనుకోలేదని..తమ మద్య పెద్దగా పరిచయాలు కూడా లేవని..తాను ముందుగా  ప్రపోజ్ చేశానని వెల్లడించాడు. మొత్తంగా ఆమెను దేవుడే తనకోసం పంపించాడని విశాల్ చెప్పుకొచ్చాడు. 
Image result for VISHAL ANISHA
అనీశా చాలా ధైర్యవంతురాలని..ఓ పులికి శిక్షణ ఇచ్చి దాన్ని నిమిషాల్లో నిద్రపుచ్చగల టాలెంట్ ఆమెకు ఉందని.. అలా నిద్రపుచ్చుతున్న వీడియోను తాను చూసి షాక్ అయ్యానని అన్నారు.  అనీశా జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణి.. అలాగే సోషల్ వర్కర్ కూడా అని విశాల్ పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలా? వద్దా? అనేది ఆమె ఇష్టమని తెలిపాడు. మార్చి నెల మొదటి వారంలో విశాల్, అనీశాల నిశ్చితార్థం హైదరాబాద్‌లో వైభవంగా జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: