ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ చిత్రం శుక్రవారం రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ వచ్చింది.  ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతుంది. 
Image result for YATRA MOVIE
అయితే పూర్తిగా రాజకీయ నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో ఈ చిత్ర దర్శకుడు వైఎస్ కుటుంబానికి..జగన్ కి తన ధన్యవాదాలు తెలియజేశారు.  రాఘవ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నాపై నమ్మకం ఉంచి, గుడ్డిగా నమ్మి రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను చెప్పిన వైఎస్ జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాను.
Image result for YATRA MOVIE
ఫలితం ఎలా ఉన్నా నాకు లాభం తప్ప నష్టముండేది కాదు. అయినా నన్ను అంతగా నమ్మి ఎందుకు రిస్క్ తీసుకున్నాను ‘యాత్ర’ సినిమాలో ఏదైనా తేడా జరిగిఉంటే వాళ్లు(జగన్ కుటుంబం)చాలా నష్టపోయేవారు. హిట్టూ..ఫ్లాపు, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఓ గొప్ప మనిషి తెరపై ఆవిష్కరించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని..అందుకు తగ్గట్టు గానే తెలుగు ప్రేక్షకులు ‘యాత్ర’ను బాగా ఆదరిస్తున్నారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: