ప్రస్తుతం దేశ‌మంత‌టా బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. రాజకీయ, సినీ, క్రీడా రంగాల్లో పేరు తెచ్చుకున్నారు..లీడింగ్ లో ఉన్నవారి జీవిత కథ ఆధారంగా బయోపిక్ లు తీస్తున్నారు.  ఇప్పటికే రాజకీయ వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా చేసుకొని యాత్ర సినిమా వచ్చింది.  ఇక బాలీవుడ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే జీవిత కథ ఆధారంగా థాక్రే బయోపిక్ వచ్చింది.  త్వరలో నరేంద్ర మోదీ బయోపిక్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో   కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ జీవితంపై ఓ బ‌యోపిక్ రూపొందుతుంది.
Image result for మై నేమ్ ఈజ్ రాగా
మై నేమ్ ఈజ్ రాగా అనే టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితాన్ని చూపించ‌నున్నారు.  సెయింట్ డ్రాకులా, కామ‌సూత్ర వంటి సినిమాలు తీసిన పాల్ రూపేష్ ద‌ర్శ‌క‌త్వంలో మై నేమ్ ఈజ్ రాగా తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్‌ని విజ‌యం సాధించిన త‌ర్వాత ఎవ‌రు ఆప‌లేరు. ఇదే సినిమా క‌థ అంటూ ద‌ర్శ‌కుడు పేర్కొన్నాడు.
Image result for మై నేమ్ ఈజ్ రాగా
ఇది రాహుల్ బ‌యోపిక్ కాద‌ని, అత‌నిపై జ‌రుగుతున్న దాడి నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడో చూపించే ఇతి వృత్త‌మ‌ని ద‌ర్శ‌కుడు రూపేశ్ అంటున్నాడు. ఈ సినిమా గాంధీ ఫ్యామిలీకి చెందిన వారంద‌రిని చూపిస్తూ రాహుల్ రాజ‌కీయ ఆరంగేట్రం జ‌రిగిన విధానాన్నిక్లుప్తంగా చూపించారు.త‌క్కువ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్న మేము క్రియాశీల రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశాన్ని చివ‌రి సీన్‌గా షూట్ చేస్తామ‌ని రూపేష్ అన్నారు. 2019 ఎల‌క్షన్స్‌కి ముందు ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: