టాలీవుడ్ లో ఆ మద్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకు వచ్చి మీడియాలో సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి.  టాలీవుడ్ లో చాలా కాలం నుంచి కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..పడక సుఖం అందిస్తేనే సినీ ఛాన్స్ లు వస్తాయని ఆరోపించింది. అందుకు తానే ప్రత్యక్ష ఉదాహారణ అని..ఎంతో మందిని సినీ ప్రముఖలను నమ్మి తాను మోసపోయానని నాలా ఎవరూ మోసపోవొద్దని కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేపట్టానని అప్పట్లో తెగ హల్ చల్ చేసింది.  మొదట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా అది ఎవరూ పట్టించుకోలేదు. 
Related image
తర్వాత మా టీవి అసోసియేషన్ వారు తనకు మెంబర్ షిప్ కార్డు ఇవ్వలేదని ఆ ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో నేషనల్ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించింది.  దాంతో శ్రీరెడ్డికి పలు సంఘాల నుంచి మద్దతు లభించింది.  కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం తీవ్ర రూపం దాల్చే సమయంలో పవన్ కళ్యాన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డి విమర్శలు మొదలయ్యాయి..వ్యక్తిగత దూషనలు చేయడం వల్ల ఉద్యమం కాస్త నీరుగారింది. 
Image result for sri reddy casting couch
ఆ తర్వాత చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి అక్కడ నుంచి సోషల్ మీడియాలో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేస్తుంది.  ప్రస్తుతం బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి జీవితంతో సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'రెడ్డి డైరీస్' అనే పేరుతో ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరెడ్డి పాత్రలో ఆమె స్వయంగా నటిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమంది ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. డాక్టర్ అలాదీన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి చిత్తిరై సెల్వన్ కథ, కథనాలను అందిస్తున్నారు.

శ్రీరెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను, సినీ పెద్దలు చేస్తున్న బాగోతాలను ఈ సినిమాలలో చూపించబోతున్నారట. శ్రీరెడ్డి అనుభవాలతో పాటు  పాటు ఆమె దగ్గర మరికొంతమంది ఓపెన్ అయిన విషయాలను కూడా సినిమా ద్వారా బయటపెట్టనున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అలెప్పీ, గోవాలలో చిత్రీకరించారు. రవిదేవన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: