#RRR రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ ఎటువంటి మేకోవర్ లేకుండా నార్మల్ గా కనిపించనున్నాడు అయితే ఎన్టీఆర్ గెట్ అప్ మాత్రం చాలా భారీ ఖాయంగా ఉంటుందని వినిపిస్తుంది. గతంలో టెంపర్ చిత్రం కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకొన్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఫిట్ కనిపించేందుకు, కొత్త లుక్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేయడానికి అప్పట్లో ఎన్టీఆర్ బాగానే శ్రమించారు. 

RRR మూవీ కోసం

టెంపర్ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అరవింద సమేతలో పర్‌ఫెక్ట్ సిక్స్‌ప్యాక్‌తో వెండితెరను షేక్ చేశాడు. సినిమా ఆరంభంలో వచ్చే ఎమోషనల్ ఫైట్‌లో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ పాత్రలకు విరుద్ధంగా దర్శకుడు రాజమౌళి డిమాండ్ మేరకు ఎన్టీఆర్ భారీకాయుడిగా కనిపించబోతున్నాడు. RRR సినిమా కోసం శారీరక ధృడత్వంతో కనిపించే మహాబలుడిగా కనిపించనున్నట్టు తెలుస్తున్నది. హాలీవుడ్ ట్రైనర్ లాయర్ స్టీవెన్స్‌ శిక్షణలో పొందారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా రెండో షెడ్యూల్‌లో రాంచరణ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ సెట్ బ్యాక్ డ్రాప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ పాత్ర కోసం దాదాపు 20 కేజీల బరువు పెరిగినట్టు తెలుస్తున్నది. 

 దంగల్‌లో అమీర్‌ఖాన్ మాదిరిగా

RRR మూవీ కోసం ఎన్టీఆర్ కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ ఎలా భారీకాయంతో కనిపించాడో ప్రస్తుతం తారక్ అలా కనిపించబోతున్నాడు. ఓ వైపు దేహాన్ని పెంచుకొంటూ పోతూ మరో వైపు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. త్వరలోనే పూర్తిస్థాయిలో పహిల్వాన్ లాంటి దేహంతో కనిపించబోతున్నాడు. భారీకాయం కోసం ఎన్టీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఏప్రిల్ చివరికల్లా పాత్ర కోసం కావాల్సిన ఫర్‌ఫెక్ట్ ఫిగర్ వస్తుంది. అప్పుడు రాంచరణ్, తారక్‌పై కొన్ని కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అని చిత్ర యూనిట్ నుంచి సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: