సాయిపల్లవి.. హీరోయిన్ అంటే ఏవో నాలుగు పాటలు.. అందాల ఆరబోత... హీరో అంటే పడిచచ్చిపోయే ఒకానొక క్యారెక్టర్.. చాలా సినిమాల్లో ఇదే పద్దతి. కానీ ఈ రొటీన్ రొడ్డకొట్టుడుకు దూరంగా ఉంటే హీరోయిన్లలో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది.

Image result for saipallavi sexy


నటనపై ఇష్టంతో వైద్య వత్తిని వదిలేసి మరీ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన సాయి పల్లవి తన ప్రత్యేకత నిలబెట్టుకుంటోంది. డ్యాన్స్ లో అదిరిపోయే టాలెంట్ ఉన్న ఈ అమ్మడు సంపాదన కంటే మంచి పేరు సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అంతే కాదు.. పారితోషకం పైన కూడా అంత పట్టింపు లేదంటోంది.

Related image


కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటోన్న ఈ అమ్మడు.. కథ బావుంటే పారితోషకం విషయంలో కాంప్రమైజ్ కావడానికి కూడా రెడీ అంటోంది. తాను దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే టైపు కాదని చెప్పకనే చెబుతోంది. ఇటీవల ఫ్లాప్ అయిన పడిపడి లేచె మనసు నిర్మాతలకు తన పారితోషకంలో కొంత మొత్తం వెనక్కు ఇచ్చి తానేమిటో మరోసారి రుజువు చేసుకుంది సాయి పల్లవి.

Related image


మరి సాయిపల్లవి ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్‌ ను నిర్మాతలు ఎలా ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది. సాయిపల్లవిని దృష్టిలో ఉంచుకుని సరైన కథ రూపొందిస్తే ఒంటిచేత్తో సినిమాను హిట్ చేసే కెపాసిటీ తనకు ఉందని ఇప్పటికే సాయిపల్లవి నిరూపించుకుంది. మరి ఇక నిర్మాతలదే ఆలస్యం..


మరింత సమాచారం తెలుసుకోండి: