నిన్న మొన్నటి వరకు రాజకీయాలలో అవినీతి ప్రక్షాళన కోసం ‘జనసేన’ పార్టీని పెట్టాను అంటూ ఉద్వేగంతో ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ ‘జనసేన’ లో అవినీతి వివాదాలలో కూరుకుపోయిన కొందరు ప్రముఖ వ్యక్తులు చేరడం అత్యంత సంచలనంగా మారింది. దీనితో అవినీతికి చిరునామాగా ఉండే వ్యక్తులకు ‘జనసేన’ కూడ ఆశ్రయం ఇస్తోందా ? అన్న సందేహాలు అనేక వర్గాల నుండి వినిపిస్తున్నాయి. 

గత కొద్దిరోజులుగా ‘జనసేన’ లో బాగా చదువుకున్న విద్యావంతులు రాజకీయ విశ్లేషకులు కొంతమంది ప్రముఖ ఎన్ఆర్ఐ లు వరసగా చేరిన నేపధ్యంలో పవన్ తన ‘జనసేన’ ద్వారా ఆరోగ్యకరమైన సంకేతాలు ఇస్తున్నాడు అని చాలామంది భావించారు. అయితే నిన్న ‘జనసేన’ లో ఊహించని పరిణామం జరిగింది. 

తమిళనాడు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా పనిచేసి గతంలో అనేక అవినీతి వివాదాలలో చిక్కుకున్న పాపిశెట్టి రామోహన్ రావ్ ను పవన్ తన ‘జనసేన’ పార్టీకి రాజకీయ సలహా దారుడుగా నియమించుకోవడం అత్యంత సంచలనంగా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ఆత్మీయుడుగా పేరు గాంచిన ఈ కీలక అధికారి పై అనేక వివాదాలు ఉన్నాయి.

అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అంటూ ఉద్వేగంతో ఉపన్యాసాలు ఇచ్చే పవన్ ఈయనను సాదరంగా ఆహ్వానించడమే కాకుండా ఆయనకు కీలక పదవిని జనసేనలో ఇవ్వడం పవన్ సన్నిహితులను కూడ ఆశ్చర్య పరిచినట్లు టాక్.  ఇది ఇలా ఉండగా  నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రి చందరబాబు నాయుడు నిరసన దీక్షకు ఎంతో కాలంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వామ పక్షనేతలు హాజరు కాకుండా చూడటంలో పవన్ సలహా సంప్రదింపులు ఉన్నాయి అని వస్తున్న వార్తలను బట్టి పవన్ రాజకీయాలలో తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుని అధికారమే లక్ష్యంగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: