ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు  ఉదయం మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అసలు పేరు.గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు.


 
చిరంజీవి హీరోగా వచ్చిన 'మగ మహారాజు'తో దర్శకుడిగా మారిన బాపినీడు.. అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఇండస్ట్రీకి అందించారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


మంచి చిత్రాలకు, కుటుంబ కధా చిత్రాలకు విజయబాపినీడు పెట్టింది పేరు. ఆయనలోని మరో కోణం. పత్రికా బాధ్యతల నిర్వహణ. విజయ పేరు మీద ఆయన 70 దశకంలో పత్రికను స్థాపించి వియయవంతంగా నడిపారు. అప్పట్లో అయిదు రూపాయలకు విజయ నెల పత్రికలో సినిమా బుక్, కామెడీ బూక్, నవల వంటివి కలిపి ఒక ప్యాక్ గా అందికరికీ అందిచిన ఘనత ఆయనే దక్కింది. ఓ విధంగా అది షడ్రసోపేత భోజనంగా ప్రతి ఇంటా ఉండేది. అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఆయన అలా ప్యాక్ ని విడుదల చేసేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: