తెలుగు ఇండస్ట్రీలోకి పూరి జగన్నాథ్ దర్శకత్వంల కింగ్ నాగార్జున నటించిన ‘సూపర్’చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది బెంగుళూరి బ్యూటీ అనుష్క.  ఆ తర్వాత స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని వరుసగా హిట్స్ సాధించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న అనుష్క మొదట గ్లామర్ పాత్రల్లో కనిపించినా..కొంత కాలంగా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది.  అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంది. 

ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న అనుష్క ఆ మద్య ‘సైజ్ జీరో’చిత్రంతో బరువు బాగా పెంచుకుంది.  ఆ తర్వాత వచ్చిన బాహుబలి, భాగమతి చిత్రంలో కూడా అనుష్క కాస్త లావుగానే కనిపించింది.  కొంత కాలంగా తన బరువు తగ్గించుకునే పనిలో ఉన్న అనుష్క.  తాజా ఫొటోషూట్ లో అనుష్క మునుపటి లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది.

ప్రముఖ సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో..అందమైన బీచ్ తీరంలో అనుష్క ఫొటోషూట్ కు సంబంధించిన స్టిల్స్ ను షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటోలు చూసిన అనుష్క అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.  అనుష్క ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: