తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అరడజనుకు పైగా మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాన్ సంపాదించాడు.  అల్లు అర్జున్, రాంచరణ్ కూడా తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో సాయిధరమ్ తేజ్, ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ అభిరుచులకు తగ్గట్టుగా ఈ హీరోలు తమ సత్తా చాటుతున్నారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ సైతం ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి క‌ళ్యాణ్ దేవ్ లుక్స్‌, ఆయ‌న‌ న‌ట‌నకి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.  ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో కళ్యాన్ దేవ్ రెండవ చిత్రంలో నటిస్తున్నాడు.  రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. 

కళ్యాన్ దేవ్ సరసన  తూనీగ తూనీగ ఫేం రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎంపిక చేశార‌ట.  ఇదిలా ఉంటే నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా కళ్యాన్ దేవ్ మ‌ర‌ణానంత‌రం త‌న అవ‌య‌వాల‌ని దానం చేసేందుకు అంగీక‌రిస్తున్న‌ట్టు అంగీక‌ర ప‌త్రాన్ని అపోలో ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు. క‌ళ్యాణ్ దేవ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న రెండో సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: