భారతీయ చలన చిత్రాల్లో నాగు పాములకు సంబంధించిన ఎన్నో చిత్రాలు, సీరియల్స్ వచ్చాయి..వస్తూనే ఉన్నాయి.  నాగుపాము సెంటిమెంట్ తో ఎన్నో చిత్రాలు హిట్ కూడా అయ్యాయి.  విష సర్పానికి ప్రజలు ఎంత భయపడతారో..దేవతగా అంతే భక్తితో పూజిస్తారు. ఒకప్పుడు నాగు పాము చిత్రాల్లో నిజమైన నాగు పాములే దర్శనమిచ్చేవి..ఈ మద్య గ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.  తాజాగా మరోసారి ఇదే కాన్సెప్ట్ తో ‘నాగకన్య’ చిత్రం తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 

ఇందులో ముగ్గురు అందమైన అమ్మాయిలు (లక్ష్మారాయ్ - కేథరిన్ - వరలక్ష్మి శరత్ కుమార్) నాగకన్యలుగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘నీయా’పేరుతో తీస్తున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగులో 'నాగకన్య' పేరుతో విడుదల చేయనున్నారు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.  ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ చూడటానికి ఎంతో ఉత్కంఠంగా కనిపిస్తుంది.

కేథరిన్ ను నాగుపాము వెంటాడటం.. వరలక్ష్మి శరత్ కుమార్.. రాయ్ లక్ష్మి పాములుగా మారిపోవడం,పామును 'జై' ప్రేమగా హత్తుకోవడం  ముగ్గురు హీరోయిన్లకు 'జై' తాళి కడుతుండటం, శత్రువులపై పాము వరుసగా దాడి చేయడం గ్రాఫిక్స్ లో అద్భుతంగా చూపించారు. 

ఇక  పగటి వేళ ఆడపిల్లగాను .. రాత్రివేళ పాముగా బతకడం నా వలన కావడం లేదు అంటూ హీరోయిన్ చెబుతున్న డైలాగ్స్ చూస్తుంటే మూడు నాగుల మద్య జరిగే సంఘర్షనకు సంబంధించినదిగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: