అద్భుత అభినేత్రి తెలుగువారి అపురూప నటి స్వీటీ అనుష్క తిరిగి సన్నబడి సన్నజాజో, జాజిమల్లో అయిందంటూ వార్తలు వచ్చాయి.  స్లిమ్‌-లుక్‌ లోకి వచ్చేందుకు ఆమె చాలా కాలంగా దేశ విదేశాల ట్రైనర్స్ సహాయంతో వర్కౌట్లు చేస్తుంటూ కష్టపడుతోంది. ముఖ్యంగా బాహుబలి 2, సింగం 3 సినిమాల్లో స్వీటీ లుక్‌ స్వీట్  గా లేదంటూ విమర్శలు  వినిపించిన సందర్భంతో “ఇక స్వీటీ కెరీర్‌ కు ఎండ్ కార్డ్ పడ్డట్టే” అని భావించారు ప్రేక్షకులు. అభిమానులు హతాహసులే అయ్యారు.
Kona Venkat Comment On Anushka New Slim Look - Sakshi
“భాగమతి” లో అనుష్క కాస్త బరువు తగ్గినట్టుగా కనిపించినా – ఆ తరవాత ర్ఫాజమౌళి కుమారుని పెళ్ళిలో కనిపించినా – గతంలోలా గ్లామరస్‌ గా మాత్రం కనిపించలేదు. ఈ దేబ్బకుఇ మరోసారి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం తన లుక్‌- మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. తాజాగా బయటకు వచ్చిన అనుష్క ఫొటోలు అభిమానులకు షాక్‌ ఇచ్చాయి. శిరిమల్లెలా తెల్లని డ్రెస్‌ లో స్లిమ్‌-లుక్‌లో కనిపిస్తున్న అనుష్క లుక్‌ కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
సంబంధిత చిత్రం
ఈ న్యూ స్లిం లుక్‌ పై అనుష్కతో సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్‌ స్పందించారు. ‘ఇది జస్ట్‌ ఝలక్‌ అంతే సినిమాలో తన  ఫైనల్‌ లుక్‌ కోసం వెయిట్ చేయండి. స్వీటీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోంది”  అంటూ ట్వీట్ చేశారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.




స‌న్నాజాజి మళ్ళీ పుట్టిందా! న్యూ అనుష్క షెట్టి - ఫోటో-షూట్

మరింత సమాచారం తెలుసుకోండి: