తెలుగు ఇండస్ట్రీలో మెగా  ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు.  రాక్షసుడు చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తర్వాత నటుడిగా, నిర్మాతగా కొనసాగారు.  అయితే నిర్మాతగా పెద్దగా కలిసి రాలేదు..దాంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో నటించారు.  ప్రస్తుతం జబర్ధస్త్ కార్యక్రమంలో జడ్జీగా వ్యవహరిస్తున్న నాగబాబు ఈ మద్య వరుసగా బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసి  మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు.

ఇంటర్వ్యూలు పొలిటికల్ కామెంట్స్ అంటూ నాగబాబు మీడియాలో ప్రముఖంగా నిలుస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో నాగబాబు పొలిటికల్ పంచ్ లు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడే పవన్ కళ్యాన్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై పెదవి విప్పరని విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాగబాబు ఎంతో అసహనానికి గురయ్యారు.  ఈ విషయం పై ఆయన స్పందిస్తూ..తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సురేష్ బాబు ఫ్యామిలీ లు ఒక వైపు దిల్ రాజు అల్లు అరవింద్ గారు సురేష్ బాబు వీళ్లకంటే పెద్ద మాఫియా ఎవరు ఉంటారు. 
Image result for chiranjeevi pawan
ఇండస్ట్రీలో పెద్ద మాఫియా అల్లు అరవింద్ ఆయన ఓ దావూద్ ఇబ్రహీం అయితే..మా అన్నయ్య చిరంజీవి గారు చోటా రాజన్ అన్నయ్య కాకుంటే సురేష్ బాబు చోటా రాజన్ అంటూ అసహనపు వ్యాఖ్యలు చేశాడు.  కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా మంచి సక్సెస్ అందుకుంటుంది..అయితే చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకుంటే తప్పు వీరిది ఎందుకు అవుతుంది. అనవసరంగా మాఫియా అంటూ పెద్ద పెద్ద మాటలు వాడుతారు..వన్ కళ్యాణ్ స్పందించడానికి ఏముంటుందంటూ నాగబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: