'అజ్ఞాతవాసి' ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో సినిమాలకు దూరమై ప్రస్తుతం రాకీయాలలో చాల బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో జరగబోతున్న ఎన్నికల తరువాత వ్యవహరించే ఒక మాష్టర్ ప్లాన్ కు సంబంధించి ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కధనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం అనేక మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ లో ‘జనసేన’ కు ఎక్కడా 5 శాతం మించి ఓట్లు రావు అని వస్తున్న కథనాలు పవన్ దృష్టి వరకు వెళ్ళినట్లు టాక్. 

ప‌వ‌న్ ను లెక్క చేయ‌ని చంద్ర‌బాబు..విష‌య‌మేంటి ?
అంతేకాదు పవన్ కళ్యాణ్ వల్ల ప్రభుత్వ వ్యతిరేక నెగిటివ్ ఓటు చీలుతుంది కాని దాని  వల్ల పవన్ కు వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు అని వస్తున్న విశ్లేషణలు దృష్టిలో పెట్టుకుని పవన్ రాబోతున్న ఎన్నికల ఫలితాలు రాకుండానే తదుపరి వ్యూహాలను కూడ రచిస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వాటి గురించి మధనపడే కన్నా ముందుగానే ఆలోచనలు చేసి పెద్దగా టైమ్ గ్యాప్ తీసుకోకుండా జూలై నెల ప్రాంతంలో పవన్ నటించబోయే ఒక కొత్త సినిమా కథ విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ఆ కథనంలో పేర్కొనబడింది.
Pawan Kalyan's JanaSena Porata Yatra
అంతేకాదు ఒక తమిళ యంగ్ డైరెక్టర్ తన టీమ్ తో కలిసి ఒక సామాజిక అంశానికి సంబంధించిన పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను పవన్ సినిమాకు కథగా మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి అని అంటూ ఆకధనంలో పేర్కొనబడింది. ఇప్పటికే పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి అతడి డేట్స్ గురించి ఎదురు చూస్తున్న ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈమూవీని నిర్మిస్తుందని ఆ కథనంలో పేర్కొనబడింది. 
2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: పవన్ కళ్యాణ్
అంతేకాదు పవన్ రాబోతున్న ఎన్నికలలో తనకి వచ్చే ఓట్ల శాతం చూసుకుని తద్వారా తదుపరి ఎన్నికలకి ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా సన్నద్ధమవ్వాలి అనేది ప్లాన్‌ చేసుకుంటాడనే అంశాలను కూడ ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే తన టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌కి అనుగుణంగా షూటింగ్స్‌ చేస్తానని కనీసం ఏడాదికి ఒక సినిమా చేసే విధానంగా తన సినిమా కెరియర్ ను కొనసాగిస్తూ 2024 ఎన్నికలు లక్ష్యంగా పవన్ వ్యూహాలు ఉండబోతున్నాయి అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సీరియస్‌ రోల్‌ ప్లే చేయలేక ఫెయిల్ అయిన పవన్ ను తెలుగు ప్రజలు రానున్న రోజులలో సీరియస్‌గా తీసుకుంటారా అన్న అనుమానాన్ని ఆ మీడియా కథనం వ్యక్త పరుస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: