తెలుగు లో  మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’సినిమాలో హీరోయిన్ గా నటించిన రెజీనా..తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.  యంగ్ హీరోల సరసన నటిస్తూ.. వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకుంది.  కొంత కాలంగా రెజీనాకు పెద్దగా హిట్స్ లేకపోవడంతో ఛాన్సలు బాగా తగ్గాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఈ మద్య కొత్త హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది.  దీంతో రెజీనా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించాల‌నుకుంటుంది.

అ! లాంటి ప్రయోగాత్మక సినిమాలో నటించిన రెజీనా ఇటీవ‌ల బాలీవుడ్ సినిమా లో బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’లో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు.  ఈ సినిమాలో సోనమ్ కపూర్ కి లవర్ గా నటించింది. తాజాగా మరో ప్రయోగాత్మక పాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. రెజీనా డ్యాన్స్ టీచ‌ర్‌గా న‌టించేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమాకు రాజపాండి దర్శకత్వం వహిస్తున్నారు.
Image result for regina cassandra
అర‌వింద్ స్వామి ప్ర‌ధాన‌ పాత్ర‌లో మూవింగ్‌ ఫ్రేమ్‌ బ్యానరుపై ఎస్‌.పార్తి, దీనా నిర్మిస్తున్న చిత్రం ‘కల్లపార్ట్‌’. హరీష్‌, ఆదేష్‌, బాబ్రిఘోష్‌, రాక్షసన్‌ ఫేమ్‌ బేబి మోనికలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందట.  ఈ సినిమాలో రెజీనా  డ్యాన్స్ టీచ‌ర్‌గా అల‌రించ‌నుంద‌ట‌. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ పూర్తి కాగానే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: