ఏమాటకామాటే చెప్పుకోవాలి.. సినిమా పబ్లిసిటీలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. ఈయన పబ్లిసిటీ స్టంట్స్ పై హార్వార్డ్ లో ప్రత్యేకమైన కోర్టు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఈ ఆర్జీవీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం కొత్తఎత్తు వేస్తున్నాడు.

Image result for lakshmis ntr


మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు నిర్మాతలు. ఈనెల 22వ తారీఖున ఈ మహానాయకుడు విడుదల అవుతోంది. అయితే ఈనెల 22 నుంచే లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలవుతుందట. అది కూడా మహానాయకుడు సినిమా థియేటర్లలోనేనట.

Related image


అంటే మహానాయకుడు సినిమాకు వెళ్లిన వారు.. మధ్యలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ చూసి రావచ్చన్నట మాట. ఈ రెండు సినిమాలకూ ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ కామన్ పాయింట్ కాబట్టి.. తన ట్రైలర్ బాగా కనెక్టవుతుందన్నది ఆర్టీవీ ప్లాన్. దీనికి తోడు బోలెడు పబ్లిసిటీ కూడా.

Related image


మరి ఈ రామ్ గోపాల్ వర్మ నిర్ణయం ఏం కలకలం సృష్టిస్తుందో... అసలు మహానాయకుడు ఆడే ధియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ వేసేందుకు బాలకృష్ణ అంగీకరిస్తారో లేదో.. ఇప్పటికే కథానాయకుడు ఇచ్చిన షాక్ లో ఉన్న నిర్మాతలకు ఇప్పుడు వర్మ ఇస్తున్న షాక్‌ లు ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయో.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: