అక్కినేని వారి కోడలు సమంత చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత కూడ తన స్పీడ్ ను కొనసాగిస్తూ వరసపెట్టి విజయాలను అందుకుంటూనే ఉంది. పెళ్ళి తరువాత ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు మక్కువ చూపుతున్న సమంత తన గ్లామర్ తగ్గలేదు అన్న సంకేతాలను సందర్భం వచ్చినప్పుడల్లా ఇస్తూనే ఉంది.

సమంత ఇన్ స్ట్రా గ్రామ్ పేజీకి 6 మిలియన్ల ఫాలోయర్స్ దాటిన సందర్భంగా ఆమె తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ తన గ్లామర్ లుక్ తో కూడిన మూడు హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోలను తన ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. డిజైనర్ వేర్ తో తన సెక్స్ లుక్స్ ను బయటపెడుతూ ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలను చూసి నాగార్జున అభిమానులు అసహనానికి లోనవుతూ ఉంటే నెటిజన్స్ మాత్రం ఆమె గ్లామర్ లుక్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇన్ స్ట్రా గ్రామ్ లో సమంత క్రియేట్ చేసిన రికార్డ్ ఒక విధంగా మహేష్ అల్లు అర్జున్ లకు షాకింగ్ అనుకోవాలి. టాప్ హీరోలుగా ఎంతో క్రేజ్ ఉన్న మహేష్ అల్లు అర్జున్ లకు ఇన్ స్ట్రా గ్రామ్ లో ఇప్పటి వరకు మూడు మిలియన్ ఫాలోయర్స్ సంఖ్య దాటలేదు. అయితే సమంత వీరిద్దరి కంటే అభిమానుల సంఖ్యలో ముందు ఉండటమే కాకుండా మహేష్ బన్నీలు సమంత రికార్డ్ ను అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. 

ప్రస్తుతం సమంత చైతన్యతో కలిసి నటిస్తున్న ‘మజిలి’ సినిమా ద్వారా చైతూకు ఒక భారీ హిట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇదే కాకుండా నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘బేబి’ లో నటిస్తూ నటనపరంగా తనకు ఎదురులేదు అని నిరూపిస్తూ గ్లామర్ పరంగా కూడ ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా తాను ఎప్పటికీ నెంబర్ వన్ అన్న సంకేతాలు ఇస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: