అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ వాస్తవానికి రేపటి రోజున వాలంటైన్స్ డే సందర్భంగా ప్రారంభం కావలసి ఉంది. అయితే ఈమూవీ ప్రారంభోత్సవం ఫిబ్రవరి నుండి మార్చి నెలకు వాయిదా పడటం వెనుక ఊహించని సమస్యలు ప్రభావితం చేసాయి అన్న వార్తలు వస్తున్నాయి. 
Allu-Arjun-Trivikram-Srinivas-Film-Launched-Today
వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్నీ బడ్జెట్ తో ఉంటాయి. అయితే ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలకు మంచి టాక్ వచ్చినా మితిమీరిన బడ్జెట్ వల్ల సినిమాల స్థాయి పెరిగి అనవసరంగా బయ్యర్లు నష్టపోయే పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. 
Allu-Arjun-New-Film-Launched
దీనితో ఈసినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న అల్లు అరవింద్ ఈమూవీ బడ్జెట్ ను ఏమాత్రం పెంచవద్దు అని స్పష్టమైన సంకేతాలు త్రివిక్రమ్ కు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీలో నటించే హీరోయిన్ కు 50 లక్షలకు మించి పారితోషికం ఇవ్వవద్దు అంటూ అరవింద్ త్రివిక్రమ్ పై కండిషన్స్ పెడుతున్నట్లు టాక్. 
Allu Arjun to collaborate with Trivikram for the third time?
వాస్తవంగా పారితోషికాల విషయాలలో భారీగా వ్యవహరించే త్రివిక్రమ్ కు ఈ కండిషన్స్ తలనొప్పులు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీకి హీరోయిన్ గా త్రివిక్రమ్ దృష్టిలో ఉన్న రష్మిక కీర్తి సురేశ్ సాయి పల్లవి లలో ఎవర్ని ఎంపిక చేసినా కోటి రూపాయల పైనే కావాలి కాబట్టి ఈమూవీ బడ్జెట్ లో ఎక్కడ కోత పెట్టాలి అన్న విషయాల పై అయోమయం వల్ల బన్నీ త్రివిక్రమ్ ల మూవీ ఫిబ్రవరి నుండి మార్చికి జంప్ చేసింది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: