‘బాహుబలి’ మూవీకి ప్రచారం కోసం సోషల్ మీడియాను విపరీతంగా రాజమౌళి వాడుకున్నాడు. ఆసినిమాకు సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ కు సంబంధించి పత్రికలు ఛానల్స్ ద్వారా ప్రచారం జరగాలి అంటే కోట్ల రూపాయలలో ప్రకటనల పై ఖర్చు పెట్టవలసి ఉంటుంది. 

దీనితో రాజమౌళి తరుచూ తన ట్విటర్ అకౌంట్ ద్వారా సందడి చేస్తూ అనేక విషయాల పై తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈమధ్య కాలంలో రాజమౌళి పై సెటైర్లు పెరిగి పోవడంతో రాజమౌళి షాక్ అయినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికలు జరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టిఆర్ఎస్ అధినేతలకు సోషల్ మీడియా ద్వారా ఎందుకు శుభాకాంక్షలు తెలియచేయలేదు అని కొందరు గత నెల విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ పై ఎందుకు అభిప్రాయం తెలియచేయలేదు అని మరికొందరు ‘ఎఫ్ 2’ సినిమా చూసారా అంటూ మరికొందరు సోషల్ మీడియా ద్వారా అడుగుతున్న ప్రశ్నలు జక్కన్నకు తలపోటు తెప్పిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన కథ విషయంలోనూ హీరోయిన్స్ ఎంపిక విషయంలోనూ టెన్షన్ పడుతున్న రాజమౌళికి ఈసోషల్ మీడియా తలనొప్పులు ఎందుకు అని ఆలోచనలు వచ్చినట్లు సమాచారం. దీనితో తెలుస్తున్న సమాచారంమేరకు రాజమౌళి సెల్ ఫోన్ లో ట్విటర్ యాప్ ను తాత్కాలికంగా తొలిగించు కున్నట్లు తెలుస్తోంది. 
Rajamouli-Gives-Chance-to-Hidden-Force-Behind-Latest-Hits
అయితే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్దపెద్ద నాయకులు అంతా ప్రత్యేకమైన టీమ్స్ ను పెట్టుకుని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఇండియన్ టాప్ సెలెబ్రెటీ సోషల్ మీడియాకు దూరంగా జరిగాడు అని వార్తలు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనితో ఈ పరిణామాలు అన్నీ రాజమౌళికి ‘ఆర్ ఆర్ ఆర్’ పై పెరుగుతున్న శ్రద్ధ అనుకోవాలా లేకపోతే సోషల్ మీడియా పై అసహనం అనుకోవాలా అన్న కోణంలో కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: