భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బయోపిక్‌కు 'పీఎం నరేంద్రమోదీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  వివేక్ ఒబెరాయ్ ముమ్మూర్తుల ప్రధాని మోదిని పోలినట్లే కనిపిస్తుంది ఫస్ట్ లుక్.
PM Narendra Modi biopic: Manoj Joshi plays Amit Shah—Check first look pics
తాజాగా మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమిత్ షా పాత్రను మనోజ్ జోషి పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. 23 భాషల్లో డిజైన్‌ చేసిన పోస్టర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేశారు.
Image result for 'పీఎం నరేంద్ర మోదీ'
వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్‌పై 'దేశ భక్తే నా శక్తి' అన్న క్యాప్షన్‌ ఆసక్తికరంగా ఉంది.  గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరపనున్నారు. ఎన్నికల్లోగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: