మహేష్ అందగాడు, మంచి నటుడు, తన సినిమాలు, కుటుంబం ఇవి తప్పించి ఆయనకేం తెలియదు అంటోది మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్. మా ఆయన బంగారం ఆయనకు బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఆయన మీద వస్తున్నవన్నీ  వట్టి పుకార్లే సుమా అంటోంది. నమ్మొద్దు అని కూడా చెబుతోంది. ఇంతకీ మహేష్ మీద వచ్చిన ఆ పుకార్లేంటి..


మహేష్ బాబు సినిమాల్లోనే డైలాగులు బాగా  కొడతారట కానీ నిజ జీవితంలో ఆయనకు అన్నేసి మాటలు రావట. భరత్ అను నేను అనే సినిమాలో ముఖ్యమంత్రిగా చేసిన మహేష్ కి నిజానికి రాజకీయాలు ఏమీ తెలియవుట. ఆ మాట స్వయంగా మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఇపుడు ఆయన సతీమణి నమ్రత ఇదే మాట అంటోంది. మా ఆయన ఏంటో ఆయన సినిమాలు, కుటుంబం ఏంటో. అంతే తప్ప మరేమీ తెలియవని అంటోంది.


మహేష్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని వస్తున్న వార్తలను నమ్మొద్దు అని చెబుతోంది. ఆయనకు నాతోనే రాజకీయాలు గురించి మాట్లాడరు, ఇక స్టేజ్ మీదకు వెళ్ళి ఏం చెబుతారు. అవన్ని వట్టి పుకార్లు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటారంతే అంటూ మహేష్ టీడీపీ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మహేష్ చిన్నాన్న ఆదిశేషగిరిరావు ఈ మధ్యనే టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ టీడీపీకి సపోర్ట్ గా ప్రచారం చేస్తారని అనుకుంటున్నారంతా. దానికి నమ్రత అలా బ్రేక్ వేసేశారన్న మాట..



మరింత సమాచారం తెలుసుకోండి: