రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' లో కలిసి నటిస్తున్న చరణ్ జూనియర్ లకు ఎప్పటినుంచో మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఒక చిన్న సినిమాకు సంబంధించిన టీజర్ చరణ్ జూనియర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా మారింది. ప్రస్తుతం ఎంత భారీ సినిమా అయినా  పైరసీకి గురికావడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. 
ఛాన్స్ దొరికితే మేము కుక్కలమే
పెద్ద హీరోలు చిన్న హీరోలని తేడా లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన వెంటనే పైరసీ ప్రింటు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ పైరసీ అంశాలన్ని కధా వస్తువుగా చేసుకుని  త్వరలో విడుదలకాబోతున్న చిన్న సినిమా  'హీరో హీరోయిన్' టీజర్ సంచలనంగా మారింది.  లేటెస్ట్ గా  విడుదలైన ఈ మూవీ టీజర్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగే పైరసీ గొడవను  చూపించారు ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని సినిమా పైరసీ సబ్జక్టుతో రూపొందుతున్న ఈ చిత్రానికి అడ్డా ఫేం జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.  
రామ్ చరణ్ మూవీకి పైరసీ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్
'మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే' అంటూ హీరో నవీన్ చంద్ర చెప్పే డైలాగుతో టీజర్  మొదలైనప్పుడు మా ఎన్టీఆర్ సినిమాను పైరసీ చేస్తావా? అంటూ కొందరు ఫ్యాన్స్  నవీన్ చంద్రను  కొట్టడానికి  వచ్చినప్పుడు వారిని కూల్ చేయడానికి ‘వచ్చేవారం రామ్ చరణ్ మూవీ విడుదలవుతుంది. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా' అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నట్లు టీజర్లో చూపించారు. దీనితో జూనియర్ అభిమానులు చరణ్ సినిమా పైరసీని కోరుకుంటున్నారా అన్న అర్ధం వస్తుంది.  
ప్రొడ్యూసర్ కూతురు అయితే ఏంటి?
 ‘ప్రతి మగాడు ప్లేబాయే.. ఛాన్స్ దొరికితే మేము కుక్కలమే' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగులు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఊహించని విజయాలు అందుకుంటున్న నేపధ్యంలో ఈమూవీకి కూడా విజయవంతం అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: