ఎన్టీఆర్ కథా నాయకుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు విద్య బాలన్ పరిచయం అయ్యింది. అయితే ఈ మధ్య విద్యా బాలన్ మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మీడియా లో చాలా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. నలభై తర్వాత మహిళలు శృంగారాన్ని కూడా బాగా ఆస్వాధిస్తారని చెప్పుకొచ్చింది! ఇలా మాట్లాడుతున్న విద్య.. మరోసారి ఒకింత హాట్ గా స్పందించింది. ఈసారి ఆమె వార్డ్ రోబ్ లో ఏముంటాయి? అనే ప్రశ్నకు ఊరించే సమాధాన్ని ఇచ్చింది విద్యాబాలన్.

Image result for vidya balan

‘మీ వార్డ్ రోబ్ కలెక్షన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు చాలామంది హీరోయిన్లు సమాధానాలు చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి వాళ్లకు ఇష్టమైన డ్రస్సులు, శారీల గురించి చెప్పుకొంటూ వస్తుంటారు. హీరోయిన్ల ఇంటర్వ్యూల్లో ఇది చాలా రొటీన్ కొశ్చన్. ఈ రొటీన్ కొశ్చన్ కు హాట్ ఆన్సర్ ఇచ్చింది విద్యాబాలన్. 'కంఫర్లబుల్ బ్రా...' అంటూ మొదలుపెట్టింది ఈమె. ‘అన్ని వేళలా.... పర్ఫెక్ట్ బ్రా... అది చాలా ఇంపార్ట్ంట్’ అని చెప్పుకొచ్చింది.

విద్యాబాలన్.. హాట్ టాక్.. ఆపట్లేదు!

ఇలా లోదుస్తుల ప్రస్తావన తీసుకొచ్చి తను ఎంత హాటో, ఎంత నాటీనో చాటుకుంది విద్యాబాలన్. ‘బ్రా’ను ఇలా స్ట్రెస్ చేసిన ఈ నటీమణి.. దానితోపాటు జీన్స్ ప్యాంట్స్, లవ్లీ కాటన్ శారీస్ ఉంటాయని చెప్పింది. మొత్తానికి నలభైయేళ్ల వయసులో మహిళలు హాట్ గా మారతారని చెప్పిన విద్య.. తన స్టేట్ మెంట్ కు న్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: