అత్యంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని నిర్మించ బడుతున్న ‘సైరా’ మూవీలోని పాత్రధారులకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ ఈమూవీకి క్రేజ్ పెంచుతున్నారు. అయితే అప్పుడే ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీ పై కూడ కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తూ కొన్ని సెటైర్లు వేస్తున్నారు. 
Sye Raa Narasimha Reddy teaser: Chiranjeevi's aggression and the thumping musical score will leave you hooked - watch video
ప్రధమ స్వాతంత్ర ఉద్యమం జరిగిన 18వ శతాబ్దం కాలంనాటి సినిమా కావడంతో ఈమూవీలో నటించే అన్ని పాత్రలకు నిండుగా గడ్డాలు మీసాలు పెట్టి ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేసారు. ఇప్పుడు ఈవిషయమే ఈమూవీ పై సెటైర్లు పడేలా చేస్తోంది. ఆకాలంలో మనుషులంతా మీసాలు గడ్డాలు బాగా పెంచేవారా ? భుజాల వరకు జుట్టు పెంచేవారా? వందేళ్ల కిందట భారతీయులకు గడ్డం గీసుకోవడం కూడా తెలీదా అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  
Chiranjeevi in Sye Raa Narasimha Reddy
ఈసినిమాకు సంబంధించి చాల కాలం క్రితం చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. పొడవాటి జులపాలతో దట్టమైన గడ్డంతో భలే ఉన్నాడే అన్న ఫీలింగ్ అందరికీ వచ్చింది. ఆ లుక్ కు మంచి స్పందన కూడ వచ్చింది. ఆతరువాత ఇదే సినిమాలో నటిస్తున్న సుదీప్ లుక్ విడుదల చేసారు. అయితే అతడి లుక్ కూడ ఇంచుమించు చిరంజీవి లుక్ లాగే అదే హెయిర్ స్టయిల్ అదే గడ్డం అదే మీసం చేతిలో ఆయుధం క్యారెక్టర్ పేరు మాత్రమే మారింది. 
Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy leaked stills,Sye Raa Narasimha Reddy leaks pics
దీనితరువాత ఇదే మూవీలోని విజయ సేతుపతి లుక్ కూడ ఆతరువాత బయటకు వచ్చింది. సుదీప్ చిరంజీవి గడ్డంతో పోల్చుకుంటే గడ్డం సైజు తగ్గింది కానీ ఇంచుమించు అతడి లుక్ లో కూడ వెరైటీ లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా చిరంజీవితో పాటు కీలక పాత్రలన్నీ సేమ్ మేకోవర్ తో ఉంటాయని అందరూ అనుకునే లోపే జగపతిబాబు లుక్ కూడ బయటకు రావడం జరిగింది. అయితే ఇందులో కూడ వెరైటీ కనిపించలేదు అన్న మాటలు వస్తున్నాయి. చివరికి రాజగురువు పాత్రను పోషిస్తున్న అమితాబ్ పాత్రలో కూడ ఇదే రకం ట్రెండ్ కొనసాగడంతో ‘సైరా’ లో కనిపించే పాత్రల గెటప్స్ లో వైవిద్యం లేకుండా ఒకేరకంగా ఉంటాయా అంటూ కొందరు అప్పుడే మొదలు పెట్టేసిన నెగిటివ్ ప్రచారం మెగా కాంపౌండ్ కు షాక్ ఇస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: