సంక్రాంతికి వచ్చిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. సినిమా పరంగా ఈ మూవీకి మంచి రివ్యూలే వచ్చినప్పటికీ నిలకడగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.



ఇటీవల భారీగా అమ్ముడై ఆ తర్వాత నష్టాలు తెచ్చిన సినిమాలను నిర్మాతలు ఆదుకొంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కథానాయకుడుతో నష్టపోయిన పంపిణీదారులను ఆదుకోవాలని డిసైడ్ అయ్యారు.



పంపిణీదారులందరికీ నష్టాల్లో మూడో వంతు చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు రెడీ అయ్యారు. దీంతో పాటు మరో ఉపశమనం కూడా కలిగిస్తున్నారు. కథానాయకుడు పంపిణీ చేసిన వారందరికీ మహానాయకుడు పంపిణీ ఇస్తున్నారు.



మహానాయకుడు వసూళ్లలో 40 శాతం పంపిణీదారులకే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఈ చిత్ర బందం అధికారికంగా ప్రకటించింది. మొత్తానికి కథానాయకుడు సినిమా ఫ్లాప్ అయ్యిందని బాలయ్యే ఒప్పుకున్నట్టయింది. మరి మహానాయకుడు ఏం చేస్తాడో..?


మరింత సమాచారం తెలుసుకోండి: