కిక్కు కోసం మహేశ్ బాబు హైరిస్క్ తీసుకుంటున్నాడు. తనపై భారి అంచనాలతో విడుదలకు సిద్దమవుతున్న ‘వన్ ’ సినిమాను అందుకు తగ్గట్టుగా ప్రేక్షకులకు అందించేందుకు అవసరం లేకున్నా తీసుకుంటున్న రిస్క్ తో సినిమా యూనిట్ వారు కూడా ఆందోళన చెందుతున్నారు. పొరపాటున ఏమైనా జరిగితే మొత్తం సినిమాకే ప్రమాదం అంటన్నారు.

అయినా సరే మహేష్ బాబు వినడం లేదట, పక్కా మాస్ , ఎంటర్ టైనర్ మెంట్ సినిమాగా అత్యంత ప్రమాదకరమైన ఫైటింగ్ సీన్లతో ప్రేక్షకుల గుండెలను ఝలధరించే రీతిలో ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అసలే ముట్టుకుంటే కందిపోతాడా అన్నట్టుండే ఆ చాక్లెట్ హీరో అంత రిస్క్ తీసుకోవడం కేవలం రియల్ ఎఫెక్ట్స్ చూపించి తన అభిమానులుకు కిక్ తో పాటు సినిమాకు కూడా మంచి పేరు తేవాలన్నదే ఆయన తాపత్రయం అంటున్నారు.

ఈ సినిమాలో ఉన్న ఖతర్నాక్ ఫైట్స్, ధైర్యంతో చేసే సన్నివేశాల చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. ఈ సన్నివేశాలలో డూప్ ల సహాయం లేకుండా, తగినన్ని రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా స్వయంగా పాల్గొంటున్నాడు మహేష్ బాబు. ఇది చూసే వారికి కూడా రియాలిస్టిక్ గా కనిపించి సినిమాలో వాస్తవికత కన్పించడమే కాకుండా, తన పవరేంటో చూపించి అభిమానులకు కిక్కు ఎక్కిస్తా అంటున్నాడు ప్రిన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: