తెలుగు ఇండస్ట్రీలో సంచలనాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న దర్శకులు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   ఈ చిత్రం షూటింగ్ మొదలు నేడు టీజర్ రిలీజ్ చేస్తున్నంత వరకు తనదైన ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాడు.  ఈ చిత్రం ఎన్టీఆర్ కన్నీటి జీవితం అని..ఆయన ఆత్మశాంతి కోసమే ఈ చిత్రాన్ని తీస్తున్నానని..ఆయన దీవెనతో చిత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని అన్నారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్ కొద్దిసేపటిక్రితం విడుదలైంది. 'రామ రామ రామ రామ...' అంటూ మొదలైన ట్రయిలర్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పాత్రలను, నటుడు మోహన్ బాబు పాత్రను చూపించారు.  ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే..ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.  ఈ ట్రైలర్ లో స్వామీ... మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే' అనే డైలాగ్, 'రాత్రుళ్లు కూడా అక్కడే ఉంటోందట' అన్న డైలాగ్, చంద్రబాబు పాత్రధారితో "ఈవిడ పేరు లక్ష్మీపార్వతి... మా జీవిత చరిత్ర రాస్తున్నారు" అన్న ఎన్టీఆర్ డైలాగ్ వినిపిస్తున్నాయి.

"శారీరక సుఖం కోసమో... ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోద్బలం కోసమో..." అనే డైలాగ్, 'దానికిగాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్' అన్న డైలాగులు ఉన్నాయి. ఆపై "ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే..." అంటున్న ఎన్టీఆర్ కుమారుడి డైలాగ్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ బాధతో తన కుటుంబ సభ్యులతో నా పిల్లలై ఉండి  వాడితో చేరారా సిగ్గులేకుండా అని ఎన్టీఆర్ అనడం, లక్ష్మీపార్వతి మెడలో తాళి కట్టడం, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన దృశ్యాలను ట్రయిలర్ లో చూపించారు వర్మ. 

ట్రైలర్ లో చివరగా నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే" ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ కొడుతున్న డైలాగ్స్ చూస్తుంటే..ఈ చిత్రంలో కొంత మందిని దారుణంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.  మొత్తానికి సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ దుమ్మురేపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: