టాలీవుడ్ లో సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లోవచ్చిన ‘రంగస్థలం’సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లో రాంచరణ్ ని ఓ రేంజ్ లో చూపించారు.  సంక్రాంతి పండుగ కానుకగా ‘వినయ విధేయ రామ’ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  అయితే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో డివైడ్ టాక్ వచ్చింది.  కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా పరవాలేదు అనిపించింది. 
Image result for vinaya vidheya rama posters
కేవలం బోయపాటి, రాంచరణ్ పై ఉన్న ఇమేజ్ తోనే ఈ సినిమా కొంత కాలం రన్ అయ్యిందని టాక్ కూడా వచ్చింది.  ఈ యేడాది   ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది వినయ విదేయ రామ.  గత కొన్నేళ్లుగా తెలుగులో అట్టర్ ఫ్లాపైనా సినిమాలు వేరే భాషల్లో డబ్బింగ్ రూపంలో కానీ యూట్యూబ్ పరంగా రికార్డు సృష్టిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే బాలీవుడ్ యూట్యూబ్ ల్లో సెన్సేషన్ రికార్డులు కూడా నమోదు చేసుకున్నాయి. ఇక టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్ అంటే మాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. 
Image result for vinaya vidheya rama posters
ఈ నేపథ్యంలో మాలీవుడ్ లో  ‘వినయ విధేయ రామ’ డబ్ చేశారు.  అక్కడ చెప్పుకోదగ్గ వసూళ్లనే సాధిస్తూ అందరినీ ఆశ్చర్యనికీ గురి చేస్తోంది. దీంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఆనందంలో ఉన్నారు. మూడు రోజుల్లో అక్కడు రూ.30 లక్షల గ్రాస్..రూ.15 లక్షల షేర్ వసూలు చేసింది.
Image result for vinaya vidheya rama posters
ఈ లెక్కలు కొంచెం చిన్నగా అనిపించినా..ఒక డబ్బింగ్ సినిమాకు అక్కడ అంత రావడం మాములు విషయం కాదంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సిందే. మొత్తానికి టాలీవుడ్ లో డిజాస్టర్..మాలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: