సామాన్యం గాసినిమాలకుసంబంధించి వర్మ చెప్పే మాటలకు తీసే సీన్స్ కు ఈ మధ్య సంబంధం  లేకుండా పోవడంతో వర్మ పని అయిపోయింది అంటూ సెటైర్లు వేసిన వారకి ఈరోజు రామ్ గోపాల్ వర్మ సరైన సమాధానం ఇచ్చాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ కేవలం ఫస్ట్ లుక్ తోనే ఆగిపోతుంది అని భావించిన చాలామంది మైండ్స్ ను బ్లాంక్ చేసాడు వర్మ. 
ప్రతి మాట గుర్తుంది
ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటలలోనే రెండు లక్షల వ్యూస్ రావడంతో సంచలనంగా మారడమే కాకుండా ఈమూవీ ఓపెనింగ్స్ ఏవిధంగా ఉండబోతున్నాయి అన్న అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. ఎన్టీఆర్ చివరి ఘట్టంలో జరిగిన విషయాల గురించి ఆయనతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరుకు సంబంధించి అనేక కథనాలు పుస్తకాలు వచ్చినా ఇప్పుడు సామాన్యులకు సులువుగా కనెక్ట్ అయ్యే సినిమాలో ఈవిషయాలు వర్మ చూపిస్తూ ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈసినిమా పైనే ఉంది. 
వంట మనుషులతో సహా
ఇక ఈరోజు విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ గురించి ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి స్వయంగా స్పందించి ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెరిగేలా సహాయపడుతున్నారు. ఈరోజు విడుదలైన ట్రైలర్‌ పై ఆమె స్పందనను అడిగినప్పుడు 'నా కన్నీళ్ళే సమాధానం' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. 
ఫోన్‌లో మాట్లాడింది నేనే స్వామి
అంతేకాదు ఆరోజులలో తనను ఎన్టీఆర్ నుండి దూరం చేయడానికి తనను కొందరు కిడ్నాప్ చేయడమే కాకుండా తనను ఉచ్చరించడానికి వీలులేని పదాలతో తిట్టిన సందర్భాలు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని లక్ష్మీ పార్వతి కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. ఈరోజు ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా జరుగుతున్న వాలంటైన్స్ డే నాడు రామ్ గోపాల్ వర్మ అసలైన ప్రేమకు నిర్వచనంగా విడుదల చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని నందమూరి తారకరామారావు లక్ష్మీ పార్వతుల నిజమైన ప్రేమకు చిహ్నంగా ఈమూవీ ద్వారా వివాదాల వర్మ ఒక వినూత్న సందేశం ఇచ్చాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: