టాలీవుడ్, కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార స్టార్ హీరోలతో సమానంగా ఆమె సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి.  దక్షిణాది హీరోయిన్లలో ఎక్కువ దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార.  గత కొంత కాలంగా నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో నటిస్తుంది.  హీరోయిన్ గా నయన్ కి ఎంత క్రేజ్ ఉన్నా..ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. 
Image result for nayanthara vignesh
కెరీర్ బిగినింగ్ లో తమిళ హీరో శింబుతో ఎఫైర్..ఆ తర్వాత కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో ఏకంగా పెళ్లి పీటల వరకు వచ్చింది.  ఆ తర్వాత వీరిద్దరి మద్య వివాదం రావడంతో అది కాస్త పెటాకులైంది.  ప్రస్తుతం నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఆమె ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ .. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూనే వుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో రూమర్ పుట్టుకొచ్చింది. 
Image result for nayanthara vignesh
ఈ మద్య నయనతార ఓ సంచలన నిర్ణయం తీసుకుందట..అదేంటంటే..వివిధ భాషల్లో కలుపుకుని తాను 100 సినిమాలను పూర్తి చేసిన తరువాతనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం.  ఇప్పటి వరకు నయనతార 60 సినిమాలు పూర్తి చేసింది..ఆమె చేతిలో కనీసం డజను సినిమాలు ఉన్నాయి..అన్నీ పూర్తి కావాలంటే కనీసం నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది.  నయనతార అనుకున్న మార్క్ ను చేరుకోవాలంటే ఓ నాలుగైదేళ్లు పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: