తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘భారతీయుడు2’చిత్రం తెరకెక్కబోతుంది.  ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  సమాజంలో లంచగొండి తనపై ఓ స్వతంత్ర సమరయోధుడు చేసిన యుద్దం భారతీయుడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.  ఈ మద్య షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చినా..అలాంటిది ఏదీ లేదని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. 
Related image
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో శింబు, సిద్దార్థ్ లు ముఖ్యపాత్రలో నటిస్తున్నారట.  కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ వున్నాడా .. లేడా అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.
Related image
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సిద్ధార్థ్ లుక్ ను రిలీజ్ చేసే ఉద్దేశంతో శంకర్ ఉన్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా చేస్తున్నాడనే విషయాన్ని ఖరారు చేస్తూ .. ఫస్టులుక్ వదలడానికి శంకర్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: