తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్.  గతంలో స్టార్ హీరోలకు ఎన్నో హిట్ చిత్రాలు అందించిన పూరి, ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్’చిత్రం తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేక పోయాడు.  ఇక దేవదాసు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం రూపొందుతుంది. 

ఈ చిత్రంలో రామ్ రఫ్ లుక్ తో కనిపిస్తూ .. మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
Image result for ismart shankar
గతంలో పూరి - మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. 'అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ప్రతి ఫంక్షన్లో వినిపిస్తూనేఉంది.  తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్  ట్యూన్ చేయమని పూరి చెప్పడంతో .. మణిశర్మ ఆ పనిని పూర్తిచేశాడని అంటున్నారు. 'నోరా ఫతేహి'పై ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: