వర్మ అనుకున్న టైం కు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసి మాట నిలబెట్టుకున్నాడు. అయితే ట్రైలర్ వదిలిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దీనితో ఈ సినిమా పట్ల జనాల్లో ఎంత ఆసక్తి వచ్చింది తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ చేసిన ఒకటిన్నర గంటలలోనే వన్ మిలియన్ వ్యూస్ మార్క్ దాటిందని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా "లార్డ్ ఎన్టీఆర్ బ్లెస్సింగ్" అంటూ రిలీజ్ అయిన రెండు గంటలకు ట్వీట్ చేశాడు. 

Image result for lakshmis ntr

ఇప్పటికి ఆ వ్యూస్ సంఖ్య RGV అధికారిక ఛానల్ లోనే మూడు మిలియన్లు దాటింది.  167K లైక్స్ వచ్చాయి. డిస్లైక్స్ 12K ఉన్నాయి.  ఇక కామెంట్స్ ఏకంగా 18 వేలు.  వీటిలోఅతి తక్కువ మంది మాత్రమే వర్మను తిట్టారు.   మెజారిటీ కామెంట్లు ఆర్జీవీ ధైర్యాన్ని పొగుడుతూ ఉన్నవే.  'ఆడు మగాడ్రా బుజ్జీ' అని ఒకరంటే మరొకరు.."నువ్వు తోపు అన్నా.. ఇలాంటి సిన్మా తీయాలంటే నీకే సాధ్యం" అన్నారు.

Image result for lakshmis ntr

ఒకరైతే "ఇండియా లో ఫ్రీడమ్ వచ్చింది ఒక్క ఆర్జీవీ కే" అంటూ వర్మ గట్స్ ను మెచ్చుకున్నారు.చిత్రమైన విషయం ఏంటంటే కామెంట్స్ చేసిన అందరూ దాదాపుగా సీనియర్ ఎన్టీఆర్ పట్ల ఎంతో ప్రేమ.. గౌరవం చూపించడం. ఎక్కువ శాతం మంది అయనకు ఇలా జరిగి ఉండాల్సింది కాదని.. ఎన్టీఆర్ ఓ లెజెండ్ అయినప్పటికీ ఆయనకు అన్యాయం జరిగిందని సానుభూతి చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: