లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమాయే హాట్ టాపిక్.. వర్మ రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఊహించిన దాని కన్నా ఎక్కువ స్టఫ్ తో ఉంది. వాస్తవాలు చూపించే విషయంలో వర్మ ఏమాత్రం రాజీపడినట్టు కనిపించడం లేదు. సినిమా కచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

Image result for AGASTHYA MANJU


అయితే ఈ ట్రైలర్ ద్వారా ఇంకో విషయం వెలుగు చూసింది. ఇప్పటి వరకూ ఈ సినిమా దర్శకుడు వర్మ అనే అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు వర్మ ఒక్కరే దర్శకత్వం వహించలేదు. వర్మతో పాటు అగస్త్య మంజు అనే వ్యక్తి కూడా దర్శకత్వం వహించినట్టు ట్రైలర్ లో టైటిల్ వేశారు.



అసలు ఈ అగస్త్య మంజు ఎవరు.. ఇప్పటివరకూ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వినిపించలేదు. అయితే వర్మ అంటేనే ఓ స్కూల్.. ఆయనకు శిష్య గణం చాలా ఎక్కువ. వారిలో ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ట్రైలర్ లో ఈ పేరు వేయడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి.



కొంపదీసి ఈ సినిమా దర్శకత్వం ఈ అగస్త్య మంజుయే చేశారా.. వర్మ దర్శకత్వ పర్యవేక్షణకు పరిమితమై.. తన పేరు వేసుకుంటున్నారా.. ఇప్పుడీ చర్చ టాలీవుడ్‌లో సాగుతోంది. ఎలాగూ వర్మ అంటే క్రేజ్ ఉన్న దృష్ట్యా.. వర్మ దాన్ని ఉపయోగించుకుంటున్నారా.. ఏమో ఈ విషయం నిలకడ మీద కానీ తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: