సినీ రాజకీయాలు ఇపుడు పెనవేసుకుపోయాయి. సినిమాల్లో విరామం వస్తే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దానికి తగినట్లుగానే గ్లామర్ కోసం రాజకీయ పార్టీలు గ్రాండ్ వెల్ కం చెబుతున్నాయి. ఇక ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ కి ఒకేమారు ఎన్నికలు వస్తున్నాయి. దాంతో టాలీవుడ్లో కూడా హడావుడి బాగా పెరిగింది.


ఇదిలా ఉండగా టాలీవుడ్లో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఇపుడు ఆయన అంతగా యాక్టివ్ గా లేరు కానీ తన వారసులను రాజకీయాల వైపుగా నడిపించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో తీసుకుంటే మంచు కుటుంబానికి ఇటు చంద్రబాబుతోనూ, అటు జగన్ తోనూ బంధుత్వం ఉంది. మోహన్ బాబు పెద్ద కొడుకు, హీరో విష్ణు భార్య విరినికా జగన్ కి కజిన్ సిస్టార్ అవుతుంది. దాంతో రెండు పార్టీల్లోనూ మంచు వారికి రాజకీయంగా అవకాశాలున్నాయి.


ఈ సమయంలో హఠాత్తుగా మంచు విష్ణు జగన్ని లోటస్ పాండ్ లో కలవడం చర్చనీయాంశమైంది. తన భార్య విరినీకాను కూడా వెంట బెట్టుకుని మరీ విష్ణు జగన్ తో భేటీ వేయడం పట్ల రాజకీయంగానూ, టాలీవుడ్లో ఆసక్తికరమైన  చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విష్ణు పోటీ చేస్తారని, ఆయన వైసీపీ టికెట్ కోసమే ఇలా కలిసారని అంటున్నారు. మోహన్ బాబు సొంత ప్రాంతం శ్రీ కాళ‌హస్తి. అక్కడ సీటు కోసం ట్రై చేస్తున్నారని టాక్. మరి జగన్ ఎలాంటి హామీ ఇచ్చారన్నది చూడాలి. ఎందుకంటే అక్కడ వైసీపీ నుంచి సీనియర్ నాయకుడు బియ్యపు మధుసూదన రెడ్డి ఉన్నారు. మరి జగన్ తలచుకుంటే విష్ణు కు ఎక్కడైనా టికెట్ ఇవ్వొచ్చు. మరి చూడాలి ఈ భేటీ ఎటువంటి రాజకీయ ప్రకటనలకు అవకాశం ఇస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: