విజయ దేవరకొండ డేట్స్ కోసం చాలామంది ప్రముఖ దర్శకులు ఆసక్తికనపరుస్తూ ఉంటే విజయ్ దేవరకొండ నటన పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు బండి సరోజ్ కుమార్ కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. అనేకమంది దర్శకుల వద్ద సహాయకుడుగా పనిచేసి ఆతరువాత దర్శకుడుగా మారిన ఈ యంగ్ డైరెక్టర్ కోలీవుడ్ లో కోలీవుడ్ లో అనేక సినిమాలు తీసాడు. 

ఆసినిమాలు కోలీవుడ్ లో అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్ తెలుగులో ‘సూర్యాస్తమయం’ అన్న మూవీని తీస్తున్నాడు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఈమధ్య మీడియా వర్గాలతో మాట్లాడిన ఈ డైరెక్టర్ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ సినిమాల ఘన విజయం విజయ్ దేవరకొండ నటనా సామర్ధ్యం వల్ల కాదనీ ఆసినిమాల స్క్రిప్ట్ లోని బలం ఆసినిమాల ఘన విజయానికి దోహదం చేసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

అయితే ఈ దర్శకుడి కామెంట్స్ లోని వాస్తవాలు ఎంత వరకు అన్న విషయం పక్కకు పెడితే తాను తీస్తున్న సినిమా గురించి చెపుతూ మధ్యలో విజయ దేవరకొండ సినిమాల ప్రస్తావన ఎందుకు తీసుకు వచ్చాడు అన్న విషయం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. దీనితో విజయ్ దేవకొండకు ఈ డైరెక్టర్ కు గతంలో ఏమైనా భేధాభిప్రాయాలు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదే సందర్భంలో ఈ యంగ్ డైరెక్టర్ తన సినిమా ‘సూర్యాస్తమయం’ గురించి మాట్లాడుతూ త్వరలో విడుదల కాబోతున్న ఈమూవీ ఈదశాబ్దంలోని ఉత్తమ సినిమాల జాబితాలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది అని చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం యూత్ కు ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండను టచ్ చేసినందుకు అతడి అభిమానులు ఈ డైరెక్టర్ ను టార్గెట్ చేసే అవకాసం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: