తెలుగు ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’చిత్రంతో మంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని తర్వాత నటించిన ఆరు చిత్రాలు అద్భుతమైన విజయం అందుకున్నాయి.  ఒకటీ రెండు చిత్రాల మినహా వరుస హిట్స్ అందుకుంటున్న నాని ప్రస్తుతం ‘జర్సీ’చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందిన వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన  'జెర్సీ' చిత్రానికి సంబంధించిన ఓ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

"అదేంటోగాని ఉన్నపాటుగా .. అమ్మాయి ముక్కుమీద నేరుగా .. తరాలనాటి కోపమంత ఆ ఎరుపేగా .. నాకంటూ ఒక్కరైనా లేరుగా .. నన్నంటుకున్న తారవే నువ్వా .. నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా .." అంటూ ఈ పాట సాగుతోంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. 

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. కృష్ణకాంత్ సాహిత్యం .. అనిరుధ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.  ఈ మద్య వరుస ఫ్లాపులు అందుకుంటున్ననాని ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కెరియర్ బాగా కొనసాగాలంటే ఈ చిత్రం హిట్ కావడం ఎంతో అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: